పరిశ్రమలకు స్వర్గధామం!
The bullet news(nellore)- పరిశ్రమలు జిల్లా దారి పట్టాయి. విశాఖ కేంద్రంగా మూడు రోజులపాటు జరిగిన పారిశ్రామిక సదస్సులో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేయటానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. మూడు రోజుల సదస్సు తర్వాత ఇక్కడి మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్న పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. గత రెండుసార్లు జరిగిన సదస్సుల కంటే అత్యధికంగా 70 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. వాటి ద్వారా జిల్లాకు సుమారురూ.50 వేల కోట్ల మొత్తం పెట్టుబడుల రూపేణా వచ్చే అవకాశం ఉందని తేల్చారు. ఇప్పటికే వివిధ పరిశ్రమలు జిల్లావైపు తరలి వస్తున్నాయి. తాజాగా కుదిరిన ఒప్పందాలతో జిల్లా పారిశ్రామిక పరుగు పెట్టనుంది.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపటం వెనుక కృష్ణపట్నం పోర్టు కీలకమైంది. సింగపూర్‌కు చెందిన ఇండస్ కాఫీ సంస్థ కేవలం పోర్టు అనుసంధానం కోసమే జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు తెలిపారు. సంస్థ రూ.80 నుంచి 100 కోట్ల మొత్తం పెట్టుబడిగా పెట్టనుంది. ఇదే తీరులో ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటు చేసిన ఒక ఎల్‌పీజీ కంపెనీ కూడా రూ.280 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయటానికి ఆసక్తి చూపింది. దీనికి ప్రధానంగా పోర్టు అందుబాటులో ఉండటమే కారణం. ఇవే కాకుండా బ్రెజిల్, మలేషియా ప్రాంతాల నుంచి వచ్చిన కంపెనీలు జిల్లాలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి విశాఖ కేంద్రంగా జరిగిన పారిశ్రామిక సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సిలికా ఆధారంగా ఉత్పత్తులను తయారు చేసే సంస్థ కూడా ఏర్పాటు కానుంది.
మొత్తం 70 ఒప్పందాలు
జిల్లాలో మొత్తం 70 పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ప్రధానంగా పర్యటక, మైనింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఆహార రంగ పరిశ్రమలు, ఆర్థిక అభివృద్ధి సంస్థ(ఈడీబీ), వస్త్ర పరిశ్రమలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. భారత్ ఫోర్జ్, హందూస్థాన్ జింక్ లిమిటెడ్‌కు సంబంధించి ఒప్పందాలు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ అధికారులకు అందాల్సి ఉంది. పవన విద్యుత్తు తయారీ పరికరాల పరిశ్రమ, సోలార్ విద్యుత్తు పరికరాల పరిశ్రమలు కూడా జిల్లాలో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒపందాలు కుదుర్చుకున్నాయి. జిల్లాలో మౌలిక సదుపాయాలకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు ప్రత్యక్ష ప్రసారంలో వివరించటం.. పోర్టు.. జాతీయరహదారి అనుసంధానం.. త్వరలో ఏర్పాటు కానున్న ఎయిర్‌పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు. దీని ఆధారంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటునకు పారిశ్రామిక వేత్తలు భారీగా ఆసక్తి చూపారు.
గతంలో కంటే ఎక్కువ
గత రెండేళ్లు నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో కంటే ప్రస్తుతం నిర్వహించిన సదస్సులో భారీగా అవగాహన ఒప్పందాలు వచ్చాయి. అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 70 ఎంవోయూలు వచ్చాయి. 2016లో మొదటి సారి నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో మొత్తం 13 ఎంవోయూలు, 2017లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో అయిదు ఒప్పందాలు మాత్రమే కుదిరాయి. గత రెండేళ్లకంటే అత్యథికంగా 70 ఒప్పందాలు కుదరటం గమనార్హం. ఇందులో ఎక్కువగా విదేశీ కంపెనీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో భాగంగా వ్యవసాయశాఖకు సంబంధించి రెండు భారీ పరిశ్రమల జిల్లాకు రానున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ది సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.200 కోట్ల మొత్తం పెట్టుబడిగా పరిశ్రమను ఏర్పాటు చేయటానికి ఒప్పందం చేసుకుంది. పరిశ్రమ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభ్యం అవుతుందని చెప్పారు. అలాగే కిసాన్ క్రాఫ్ట్ లిమిటెడ్ సంస్థ రూ.75 కోట్ల వ్యయంతో చిన్న, మధ్యతరహా రైతులకు ప్రయోజనం కలిగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. మొదటి దశ పూర్తయిన తర్వాత.. రెండో దశలో భాగంగా జిల్లాలో కరవును తట్టుకునే విత్తన తయారీ, దీనికి సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ అందిస్తుంది. కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఇంకా వివరాలు రావాల్సి ఉంది: జీఎం డీఐసీ
జిల్లాలో ఏ పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి అనే విషయమై ఇంకా పూర్తి సమాచారం లేదని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన ‘ఈనాడు’తో ఫోన్లో మాట్లాడుతూ.. విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుదిరిన ఒప్పందాల సంఖ్య ఉన్నా.. అందులో జిల్లాకు ఎలాంటి పరిశ్రమలు వచ్చాయనే విషయం తెలియాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: