ప్రత్యేకహోదాకి అడ్డంకి చంద్రబాబు నాయుడే - నెల్లూరు పార్లమెంట్ జిల్లా అద్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి
THE BULLET NEWS (NELLORE)-ప్రత్యేకహోదాకు ఏపీ ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడే ప్రధాన అడ్డంకని నెల్లూరు పార్లమెంట్ జిల్లా అద్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ పరిశీలకులు సజ్జల రామకిష్ణారెడ్డి, ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రత్యేకహోదా పేరుతో్ కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు నిధులు భారీగా పిండుకున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదానే లక్ష్యంగా మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క వైసీపీయేనన్నారు. జగన్ ఆదేశాల మేరకు మార్చి 1న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.. ఎంపీ మేకపాటి, పార్టీ పరిశీలకులు సజ్జల మాట్లాడుతూ హోదాను చంద్రబాబు నాయుడుకేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు.. ప్రత్యేకహోదా ఇచ్చే స్థాయి కల్గినవారితో కలిసి పనిచేసేందుకు వైసీపీసిద్దంగా ఉందన్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుంటే ప్రదాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ద్రోహులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు.. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళి, సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేకహోదాకి అడ్డంకి చంద్రబాబు నాయుడే - నెల్లూరు పార్లమెంట్ జిల్లా అద్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి
Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: