బెయిల్ కోసం బురిడీ బాబా విశ్వప్రయత్నాలు.. సహకారం అందిస్తున్న నేతలు..?
వాసవి, మిగతా వ్యక్తులు 13 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు వీరి జాడను గుర్తించలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించే సుధాకర్‌ను సైతం ప్రశ్నించేందుకు చొరవ చూపడం లేదు. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులు ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్న సుధాకర్‌ను ఇటీవల ప్రత్యేక గదిలోకి మార్చారు. సుధాకర్ అల్లుడు సంపత్ ఆస్పత్రి వద్ద ఉంటూ ఎవరినీ గదిలోకి పంపటం లేదు. నెల్లూరురూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఒకటి రెండు సార్లు సుధాకర్‌ను విచారించేందుకు గదిలోకి వెళ్లినప్పటికీ సుధాకర్ సైగలు చేస్తూ సమాధానం చెప్పకపోవడంతో సీఐ వెనుదిరగాల్సి వచ్చింది. చిన్నపాటి దొంగతనాలు చేసే వ్యక్తులతో ఎంతో కఠనంగా వ్యవహరించే పోలీసులు బడా మోసానికి పాల్పడిన సుధాకర్‌ను తమదైన శైలిలో పోలీసులు ఎందుకు విచారణ సాగించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సింహపురి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరుతున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతూ వైద్యం పేరిట సుధాకర్ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉంటూ కాలయాపన చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.
మీడియా ప్రతినిధులు భాగస్వాములే
నగరంలోని కొన్ని చానళ్ల ప్రతి నిధులు, పత్రికల విలేకరులు కూడా సుధాకర్ మహరాజ్‌కు కొమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరురూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయివుంది. ఇదే తరహాలో పలు పత్రికల విలేకరుల కూడా సుధాకర్‌తో కుమ్మక్కు అయినట్లు తెలుస్తుంది. సుధాకర్‌తో సంబంధాలు ఉన్న మీడియా వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
No comments: