రుచికరమైన భోజనానికి కేరాఫ్ గా ఉండే నెల్లూరు హోటల్స్ లో కల్తీ ఫుడ్ దర్శనమిస్తోంది..
THE BULLET NEWS (NELLORE)-హోటల్, రెస్టారెంట్, డాబా నిర్వాహకుల కక్కర్తి నెల్లూరియుల ప్రాణాల మీదకు తెస్తుంది.. పెద్ద పెద్ద కాస్ట్లీ హోటల్స్ కుళ్ళిన మాంసం తో ఆహారపదార్థాలు తయారు చేస్తూ నగర వాసులను హాస్పటల్ పాలు చేస్తున్నాయి..
ఐటమ్ ఏది ఆర్డర్ ఇచ్చినా కల్తీ ఫుడ్డే మనకు చేరుతుంది.. నాన్ వెజ్ అయితే ఇక చెప్పనవసరం లేదు.. రెండు, మూడు రోజులు ఫ్రీజ్లలో పెట్టి వాటికి రసాయనాలు అద్ది వెరైటీస్ భోజన ప్రియులకు విక్రయిస్తున్నారు.. నగరంలోని అనేక హోటల్స్ లో ఈ తంతే నడుస్తుంది.. ఇదే విషయం ఫుడ్ ఇన్స్పెక్టర్ చేసిన దాడుల్లో తేటతెల్లం అయింది.. నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో ని ఓ హోటల్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు.. శాంపిల్స్ సేకరించి లాబ్ కి పంపారు..
మరో పక్క కాస్ట్లీ రెస్టారెంట్ గా చెప్పుకునే ఓ హోటల్ లో చేసిన తనిఖీల్లో కుళ్ళిన మాంసం, చెడిపోయిన చేపలు, పాడైపోయిన మటన్ ను ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గుర్తించారు..దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. శాంపిల్స్ తీసుకుని లాబ్ కి పంపారు..
పెద్ద పెద్ద హోటల్స్ ఇలా ప్రజా ఆరోగ్యం కన్నా ధనార్జనే టార్గెట్ గా వ్యాపారం చేస్తుంటే పుట్టగొడుగుల్లా పుట్టుకుపోస్తున్న రోడ్డు సైడ్ హోటల్స్, చికెన్ షాప్స్ పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది.. కుళ్ళిన మాంసం పై ఆకర్షణీయమైన రసాయనాలు చల్లి అమ్ముతున్నారు.. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించడం అభినందనీయం అంటున్నారు నెల్లూరు నగర ప్రజలు..

Reviewed by ADMIN
on
March 24, 2018
Rating:
No comments: