ఆదర్శం లక్ష్మి.. ఆటల్లో రారాణి
The bullet news(nellore)- ఆట జీవన గమ్యాన్ని, ఆలోచన సరళిని మారుసుం్తది. ఉత్సాహకరమైన వాతావరణంలో నడిచేందుకు దోహదపడుతుంది. అందుకే ఆటలంటే ఇష్టం. విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దడం విధుల్లో భాగం. వారిని మెరుగులుదిద్దుతూనే అదే స్థాయిలో తాను కూడా సాధన చేస్తూ.. క్రీడాల్లో రాణించడం విశేషం.. ఇలా రెండు కారణాలుగా ముందుకు సాగడమే కాకుండా తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడల్లో ఆడి బంగారు, కాంస్యం, రజిత పతకాలు సాధిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు రాజ్యలక్ష్మీ. ఈమె పట్టణంలోని విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె క్రీడల్లో చూపుతున్న ప్రతిభపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
కావలి పట్టణంలోని కోఆపరేటివ్ కాలనీలో చిన్నంబేటి కామేశ్వరరావు, భార్య రాజ్యలక్ష్మి నివాసం ఉంటున్నారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న కుంచ కబీర్‌దాస్, కాంతమ్మ దంపతులకు రాజ్యలక్ష్మి నాలుగో సంతానం. తండ్రి ఆర్టీసీ కండెక్టర్‌గా విధులు నిర్వహింస్తుండేవారు. తన తండ్రి కబీర్‌దాస్ కుస్తీ పోటీల్లో పాల్గొని పలువురితో సన్మానాలు, సత్కారాలు పొందుతుండేవారు. ఇదిచూసిన రాజ్యలక్ష్మి తాను కూడా క్రీడల్లో శిక్షణ తీసుకొని రాణించాలని తండ్రికి తెలిపారు. తాను కూడా తనలాగే ప్రతిభ చాటాలనే సంకల్పం రావడం ఎంతో సంతోషదాయకమని తండ్రి సంతోషపడ్డారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను అభ్యసించకుండానే ఇంటి వద్ద విద్య నేర్చుకొని కొంత వయస్సు వచ్చిన తరువాత ఏకంగా 6వ తరగతిలో ఉత్తీర్ణత పరీక్ష రాసి పాసయ్యారు. 6 నుంచి 10వ తరగతి వరకు జిల్లాలోని వెంకటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తు విద్యలో రాణించడమే కాకుండా క్రీడల్లో వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకొని క్రీడల్లో తమదైనశైలిలో ఖోఖో, కబడ్డీ, పరుగుపందెం తదితర పోటీల్లో తమ సత్తాచాటారు. వెంకటగిరిలోనే ఇంటర్ జ్ఞానోదయ కళాశాల, డిగ్రీ వెంకటగిరిలోని విశ్వోదయ డిగ్రీ కళాశాలలో విద్యతోపాటు క్రీడల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను కనపరుస్తు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందుతూ పలు పతకాలు సాధించారు. క్రీడా విభాగంలో హయ్యర్ గ్రేడ్ విద్య తమిళనాడులోని వైఎంసీఏ కళాశాలలో అభ్యసించారు. క్రీడా విభాగంలోనే ఆమెకు 1993లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వచ్చినప్పటికి తాను విద్యార్థులకు క్రీడల్లో మెలకువలు నేర్పుతూ విద్యార్థులను మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఖోఖో, డిస్కస్‌త్రోబాల్, బాల్‌బ్యాడ్మింటన్, కబడ్డీ, పరుగుపందెం, వాలీబాల్, తదితర క్రీడల్లో రాణించేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
క్రీడలతో ఆరోగ్యం
రాజ్యలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయురాలు,
విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాల, కావలి ప్రతి విద్యార్థి చదువుతోపాటు, క్రీడల్లోను రాణించాలి. కొందరు విద్యార్థులు క్రీడల్లో సత్తాసాటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువుతీరారు. ప్రస్తుతం నేను వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తు పలువురు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నాను. ఈ క్రీడలతో ప్రతి వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండి వ్యాధులకు దూరంగా ఉంటారు.
సాధించిన విజయాలు
మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 45 సంవత్సరాల విభాగంలో జిల్లాస్థాయితోపాటు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని నెల్లూరు, గుంటూరు, బాపట్ల, విజయవాడ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్, డిస్కస్‌త్రో, హెమర్‌త్రో విభాగంలో బంగారు పతకాలు 10, సిల్వర్ 10, రజితం 5 పతకాలు సాధించి పలువురు మన్ననలు పొందారు.
జాతీయస్థాయిలో గోవా, కోయంబత్తూరు, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలో మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌త్రో, హెమర్‌త్రో విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి పాల్గొని బంగారు పతకాలు 2, సిల్వర్ 5, రజిత పతకాలు 5 సాధించారు.
అంతర్జాతీయ స్థాయిలో 50 సంవత్సరాల విభాగంలో 2017లో మలేషియాలో మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన పోటీల్లో ఈమె పాల్గొని హెమర్‌త్రో, డిస్కస్‌త్రో, షాట్‌పుట్ విభాగంలో పలు పతకాలు సాధించి డిస్కస్‌త్రో విభాగంలో బంగారు పతకం సాధించారు.

Reviewed by ADMIN
on
March 01, 2018
Rating:
No comments: