తెగిన కట్టలు
The bullet news(nellore)- జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో చేపట్టిన చవటపాలెం రిజర్వాయర్ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. రిజర్యాయర్‌తో పాటు తోపుగుంట, కేశవనేనిపల్లి, కాండాపురం గ్రామాల్లో కూడా నీటి నిల్వ కోసం రిజర్వాయర్లను నిర్మించటానికి 2009లో అప్పటి ప్రభుత్వం పనులను చేపట్టింది. ఇందులో చవటపాలెం రిజర్వాయర్‌కు వర్షాల కారణంగా వచ్చే వరదనీరు, తెలుగు గంగ కాలువల ద్వారా వచ్చే నీరు కలిపి 0.4 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నది ఆలోచన. అందుకు అనుగుణంగా రిజర్వాయర్‌ను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు. రిజర్వాయర్ కోసం 700 ఎకరాలను సేకరించారు. పట్టా భూములు 200 ఎకరాల వరకు ఉంది. మిగిలిన భూములు ప్రభుత్వ భూములు, సీజేఎఫ్‌ఎస్ భూములు ఉన్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి తీసుకున్న రైతువారీ పట్టా భూములకు కూడా ఇప్పటి వరకు పరిహారం మంజూరు కాలేదు. దీంతో భూములను కోల్పోయి.. పరిహారం అందక రైతులు అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన‘సా’గుతున్న పనులు
చవటపాలెం రిజర్వాయర్ పనులను 2009లో చేపట్టారు. ప్రాజెక్టును తెలుగు గంగ పథకంలో చేర్చారు. ప్యాకేజీ నెం 12 కింద రూ.28 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించారు. ఇదే పనులను రూ.24.36 కోట్లకు గుత్తేదారు తీసుకున్నారు. అప్పటి నుంచి రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. కట్ట నిర్మాణంలో ఉన్న సమయంలో గత ఏడాది నవంబరులో భారీ వర్షాలు వచ్చాయి. రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చింది. కట్ట పనులు అసంపూర్తిగా ఉండటం.. నీటి ప్రవాహ ఉద్ధృతి పెరగటంతో కట్ట కొట్టుకుపోయింది. అందులో చేరిన నీరు కూడా వృథాగా పోయింది. గుత్తేదారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణ పనులను 2013 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తికాకపోవటంతో జలవనరుల శాఖ అధికారులు కూడా ఒప్పందం గడువును ఏటా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం పనులను 30 అక్టోబరు, 2018 నాటికి పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశమే కనిపించటం లేదు.
ఆయకట్టు రైతులకు ఇబ్బంది
రిజర్వాయర్ ఆధారంగా మెట్ట ప్రాంతాలుగా ఉన్న కలువాయి, చేజర్ల, పొదలకూరు మండలాల్లోని గ్రామాల రైతులకు కనీసం 14 వేల ఎకరాల ఆయకట్టు ఇవ్వాల్సి ఉంది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు వస్తుందన్న భావన అధికారుల్లో ఉంది. దీని ప్రకారం రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తే.. గుత్తేదారునికి బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం పనులు చేయటం సాధ్యం కాదంటూ దాదాపు పనులను నిలిపేశారు. కొత్త ధరలను ఇవ్వటం ప్రసుత పరిస్థితుల్లో సాధ్యం కావటం లేదు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 38 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంటే.. రూ.7.2 కోట్ల మొత్తాన్ని ఇప్పటికే బిల్లుల రూపేణా జలవనరులశాఖ చెల్లించింది.
పరిశీలించిన నిపుణుల కమిటీ
రిజర్వాయర్ పనులను.. ఆయకట్టు లెక్కలను ప్రభుత్వం తరఫున నిపుణుల కమిటీ పరిశీలించింది. నలుగురు సభ్యుల సాగునీటిరంగ నిపుణుల బృందం పరిశీలించింది. తక్కువ వ్యయంతో ఆయకట్టు వస్తుండటంతో ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. పనులను తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలో చేర్చటంతో.. ప్రాజెక్టు పునః మూల్యాంకనం పూర్తయ్యే వరకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ఇవ్వటం సాధ్యం కాదు.
పరిహారం చెల్లింపులో కొన్ని సందేహాలున్నాయి- ప్రశాంతి,తెలుగుగంగ ప్రత్యేక ఉప కలెక్టర్
రెవెన్యూ రికార్డుల్లో అటవీభూములుగా ఉంటే వాటి స్వభావాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. సందేహాలపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే పరిహారం చెల్లించాలన్న ఆలోచనతో నిలిపేశాం. అటవీశాఖ రికార్డుల్లో మాత్రం ఎక్కడా లేదు. పూర్తి స్థాయిలో పరిశీలించి త్వరలో పరిహారాన్ని రైతులకు చెల్లిస్తాం.

Reviewed by ADMIN
on
March 01, 2018
Rating:
No comments: