ముందు వాళ్లు రాజీనామా చేస్తే..మేమూ సిద్ధం: టీడీపీ ఎంపీ
The bullet news(political)- ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన ఉధృతం చేశారు. హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజీనామాలపై వైసీపీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడ్డారు. ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు వస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ఎంపీ తోట నర్సింహం స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని మండిపడ్డారు. పార్లమెంటు అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ అని... కేవలం లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి ఇతరులు రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు.
ఎవరు ఎవరికి అన్యాయం చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్ధుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అన్నారు. మోదీని వైసీపీ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. మోదీపై నమ్మకముందంటూ వైసీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మానవహారం చేపడితే వైసీపీ ఎందుకు పాల్గొనలేదని ఎంపీ తోటనర్సింహం నిలదీశారు.
ముందు వాళ్లు రాజీనామా చేస్తే..మేమూ సిద్ధం: టీడీపీ ఎంపీ
Reviewed by ADMIN
on
April 09, 2018
Rating:
No comments: