కేంద్రంపై పోరాటానికి వైసీపీ తాజా నిర్ణయం
The bullet news(policital)- ఏపీ ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్ర ఎంపీలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు దిగగా.. మరోవైపు టీడీపీ ఎంపీలు ఏకంగా ప్రధాని నివాసమే లక్ష్యంగా దండెత్తి.. మోదీ హయాంలో ఇంతదాకా ఏ పార్టీ ఎంపీలూ చేయని రీతిలో ఆయన ఇంటి ముందే మెరుపు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ క్రమంలో తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించిన వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంపై పోరాటం మరింత ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. మంగళవారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధన జరగనుంది. ఎల్లుండి ఉదయం(బుధవారం) వైసీపీ రైల్ రోకో చేపట్టనుంది. ఎంపీల దీక్ష కొనసాగినంత కాలం నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది.
కేంద్రంపై పోరాటానికి వైసీపీ తాజా నిర్ణయం
Reviewed by ADMIN
on
April 09, 2018
Rating:
No comments: