అరుణ్ జైట్లీ అస్వస్థత...
THE BULLET NEWS -కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 65 ఏళ్ల జైట్లీని ఇంతవరకు ఆసుపత్రిలో చేర్చలేదు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన జైట్లీ ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు.
అరుణ్ జైట్లీ అస్వస్థత...
Reviewed by ADMIN
on
April 06, 2018
Rating:
No comments: