Top Ad unit 728 × 90

జగన్ కి జై కొట్టిన టిడిపి పోల్..

THE BULLET NEWS -ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇన్నాళ్లూ చాలా మంది ఈ మాట చెప్పారు. ఇప్పుడు నెటిజ‌న్లు కూడా దీనికే ఓటేస్తున్నారు. తెలుగుదేశం వీరాభిమాని నిర్వ‌హించే ఒక ఫేస్‌బుక్ పేజీలో ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇస్తారు అని ఆ అభిమాని పోల్ నిర్వ‌హించాడు.
చంద్ర‌బాబు,జ‌గ‌న్ ఫొటోలు పెట్టి పోల్ పెట్టాడు. పెట్టిన ఒక రోజులోనే 14వేల 300 మంది ఓటేశారు. అయితే ఈ పోల్ కొన‌సాగుతుండ‌గానే జ‌గ‌న్‌కు 51 శాతం మంది ఓటేశారు. చంద్ర‌బాబుకి 49 శాతం మాత్రమే మ‌ద్ద‌తు ప‌లికారు. ఫేస్‌బుక్‌లో ఒక‌సారి ఓటింగ్ పెడితే 72 గంట‌లు న‌డుస్తోంది. అయితే 24 గంట‌ల్లోనే జ‌గ‌న్‌కు ఆధిక్యం రావ‌డంతోనే… ఏమీ చేయాలో తెలియ‌క ఆ తెలుగుదేశం వీరాభిమాని ఓటింగ్‌ను నిలిపివేశాడు. అంతేకాదు పోల్ మొత్తం డిలీట్ చేశాడు.
టీడీపీ అభిమాని పేజీ కాబ‌ట్టి…. అందులో తెలుగుదేశంకి చెందిన వీరాభిమానులు ఉంటారు. ఆ పేజీకి వారే లైక్ కొడతారు. తెలుగుదేశం అభిమానుల్లోనే జ‌గ‌న్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో టీడీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.
ఫేస్‌బుక్ పోల్స్‌ను న‌మ్మ‌లేమంటూ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి లాంటి వారు అంటున్నారు. అయితే రోజురోజుకు త‌మ పార్టీ, జ‌గ‌న్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. చంద్రబాబుని ఇప్పుడు జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని వారు అంటున్నారు.
జగన్ కి జై కొట్టిన టిడిపి పోల్.. Reviewed by ADMIN on April 04, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.