చేతివృత్తిదారుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం..- మేయర్ అజీజ్
The bullet news ( Nellore) _ చేతివృత్తిదారుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. విఆర్సీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదరణ పధకం పనిముట్ల ప్రదర్శనశాలను మేయరు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్ళ నిర్వాహకులతో మాట్లాడి వివిధ చేతివృత్తి ఆధారిత అధునాతన పనిముట్ల పనితీరు విధానం అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేతివృత్తి లబ్దిదారులతో మాట్లాడి ఆదరణ పధకం గొప్పతనాన్ని ఆయన వివరించారు. అన్ని పనిముట్లపై ప్రభుత్వం 70శాతం సబ్సిడీని అందిస్తూ, బ్యాంకుల నుంచి 20శాతం రుణం మంజూరు చేయిస్తుందనీ, లబ్దిదారులు కేవలం పదిశాతం మొత్తం వెచ్చించి పరికరాలను స్వంతం చేసుకోవచ్చని మేయరు ప్రకటించారు. రుణాల రూపంలో నిధులను మంజూరు చెయ్యడం కన్నా లబ్దిదారునికి నేరుగా పనిముట్లను అందించడం ద్వారా ప్రత్యక్ష సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. పురాతన చేతివృత్తులను కాపాడుకుంటూ, అధిక ఉత్పత్తిని సాధించేందుకు వాటికి అవసరమైన అధునాతన యాంత్రిక విధానాలను అమర్చటం ద్వారా సంప్రదాయ కార్మికుల మనోభావాలను గౌరవిస్తున్నామని మేయరు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయరు వెంట టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, టిడిపి రాష్ట్ర మహిళా నాయకులు తాళ్ళపాక అనూరాధా, నాయకులు మామిడాల మధు, కిన్నెర ప్రసాద్, షంషుద్దీన్, మౌలానా, సుభాహాన్, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
చేతివృత్తిదారుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం..- మేయర్ అజీజ్
Reviewed by ADMIN
on
April 10, 2018
Rating:
No comments: