డిఎం కిష్ణారెడ్డిని పరామర్శించిన మంత్రి సోమిరెడ్డి..
The bullet news (Nellore)- కిష్ణారెడ్డిగారికి ఏలాంటి ఇబ్బందిలేదు.. మీరేమీ బాదపడొద్దంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ డీఎం కృష్ణారెడ్డి భార్యను ఓదర్చార్చారు.. కిష్ణారెడ్డి దంపతులకు దైర్యం చెప్పారు.. ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరసరఫరాల సంస్థ డీఎం కృష్ణారెడ్డిని మంత్రి సోమిరెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ.. ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ధైర్యం చెప్పారు. మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో స్థానిక రోడ్లు, భవనాల అతిథిగృహంలో మంత్రి సోమిరెడ్డి, ఇన్‌ఛార్జి జేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి డీఎస్‌వో రమణ, డీఎం కృష్ణారెడ్డిలతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సమావేశం పూర్తయ్యాక ఆయన నేరుగా ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్లారు. అక్కడే ఆయన ఆత్మహత్యకు యత్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ రాజశేఖర్ ఆయనపై చేసిన తీవ్ర ఒత్తిడి, ఇతర వేధింపులే అందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఈవిషయాన్ని ఆయన మంత్రితో జరిగిన సమావేశంలోనూ కన్నీళ్లు పెట్టుకుని విషయాన్ని చెప్పడంతో ఆయనకు సోమిరెడ్డి ధైర్యం చెప్పారని, ఏదైనా ఉంటే ఆ కమిషనర్‌తో తాను మాట్లాడతానని చెప్పినట్లు కృష్ణారెడ్డి భార్య చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో గంటన్నర వ్యవధిలో ఈ ఘటనకు పాల్పడ్డారు..
డిఎం కిష్ణారెడ్డిని పరామర్శించిన మంత్రి సోమిరెడ్డి..
Reviewed by ADMIN
on
April 10, 2018
Rating:
No comments: