కొత్త అవతారంలో ఎమ్మెల్యే చింతమనేని
The bullet news (political)- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొత్త అవతారంలో కనిపించారు. ఎప్పుడూ వివాదలతోనే వార్తల్లో నిలిచే ఆయన.. వినూత్న నిరసనతో మరోసారి హైలైట్ అయ్యారు. చాయ్ చాయ్ అంటూ కాసేపు చాయివాలాగా మారారు. ప్రధాని మోడీని గుర్తుకు తెచ్చుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వినూత్న నిరసన తెలిపారు. ఒకప్పుడు టీ అమ్మిన మోడీ.. ఇప్పుడు ప్రధాని అయ్యారని.. అదే విషయాన్ని ఆయనకు గుర్తు చేస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. నిరసన చేపట్టారు. మా చాయ్ తాగండి.. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తూ అందరికీ చాయ్ సరఫరా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలపర్రు టోల్‌గేట్ దగ్గర ప్రభుత్వ విప్ చింతమనేని ఇలా చాయ్ అమ్ముతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు..
కొత్త అవతారంలో ఎమ్మెల్యే చింతమనేని
Reviewed by ADMIN
on
April 10, 2018
Rating:
No comments: