తమిళనాడు లో నిన్నటి వరకు ఉద్యమాలు.. ఇవాళ సంబరాలు...
THE BULLET NEWS (CHENNAI)-మనకు ఉగాది మాదిరిగానే.. తమిళనాడు కొత్త సంవత్సరం సంబురాల్లో ఉంది. నిన్నటి వరకు ఉద్యమాలు, ఆందోళనలతో ఊగిపోయిన జనం.. ఇవాళ ( ఏప్రిల్ 14) పండుగ హడావిడితో సంబురాల్లో మునిగితేలారు. ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెన్నై సిటీ అరుంబాకంలో ఉన్న బాల బాల వినాయక్ టెంపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయాన్ని డబ్బులతో అలంకరించారు. నాలుగు లక్షల విలువైన నోట్లతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. అన్నీ 10, 20, 50, 100 రూపాయల నోట్ల దండలతో చూడచక్కగా తీర్చిదిద్దారు.
కరెన్సీ నోట్లతో బాల వినాయక్ టెంపుల్ ను అలంకరించటంతో భద్రతను కూడా పెంచారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కరెన్సీ నోట్లతో బాల వినాయక్ టెంపుల్ ను అలంకరించటంతో భద్రతను కూడా పెంచారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

తమిళనాడు లో నిన్నటి వరకు ఉద్యమాలు.. ఇవాళ సంబరాలు...
Reviewed by ADMIN
on
April 14, 2018
Rating:
No comments: