Top Ad unit 728 × 90

కేపీహెచ్‌బీలోని కూర‌గాయ‌ల మార్కెట్‌లో కూర‌గాయ‌లు అమ్మిన షాలినీ పాండే...

THE BULLET NEWS (HYDERABAD)-`అర్జున్‌రెడ్డి` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ షాలినీ పాండే. ఆ సినిమా త‌ర్వాత మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న `మ‌హాన‌టి` సినిమాలో ఓ కీల‌కపాత్ర ద‌క్కించుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళంలో కూడా సినిమాలు చేస్తూ షాలినీ బిజీగా ఉంది.

తాజాగా షాలినీ పాండే హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని కూర‌గాయ‌ల మార్కెట్‌లో సంద‌డి చేసింది. అక్క‌డి ఓ షాప్‌లో కొనుగోలు దారుల‌కు కూర‌గాయ‌లు అమ్మింది. `మేము సైతం` కార్య‌క్ర‌మంలో భాగంగా షాలినీ హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉత్సాహంగా కూర‌గాయ‌లు విక్ర‌యించింది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగ‌బడ్డారు.
కేపీహెచ్‌బీలోని కూర‌గాయ‌ల మార్కెట్‌లో కూర‌గాయ‌లు అమ్మిన షాలినీ పాండే... Reviewed by ADMIN on April 14, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.