అసిఫాను అవమానిస్తూ పోస్టులు చేసేడు...తన ఉద్యోగాన్ని కోల్పోయాడు...
THE BULLET NEWS - ఎనిమిదేళ్ల కాశ్మీర్ చిన్నారి అసిఫా అత్యాచారం, హత్య ఘటన ప్రపంచాన్ని సైతం కదిలించింది. దుర్మార్గులను.. ఆ మానవ మృగాలను ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు దేశం మొత్తం చిన్నారి ఘటనపై భాధపడుతున్న సమయంలో.. కేరళకు చెందిన ఓ వ్యక్తి బాధితురాలు చిన్నారి అసిఫాను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. కేరళకు చెందిన విష్ణు నందకుమార్ కొచ్చిలోని కొటక్ మహింద్రా బ్యాంక్ బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
విష్ణునందకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. అసిఫా ఈ వయసులోనే హత్యకు గురవడం మంచిది అయింది.. లేకుంటే పెరిగి పెద్దయి భారత్ మీదకు బాంబులు విసిరేది అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా దుమారం అయ్యింది. నిందితులను సమర్ధించే ఇతడు కూడా.. మానవ మృగం అని, అసలు వీడు మనిషేనా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వ్యక్తిని పెట్టుకుని ఆ బ్యాంక్ ఎలాంటిదో అర్థం అవుతుంది.. మాకుగానీ ఆ బ్యాంక్ లో అకౌంట్స్ ఉంటే వాటిని క్లోజ్ చేస్తాం అంటూ కొటక్ మహీంద్ర బ్యాంక్ పైనా విమర్శలు మొదలయ్యాయి.
పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేయడంతో ఈ విషయంపై కొటక్ మహీంద్రా బ్యాంక్ స్పందించింది. ఏప్రిల్ 11, 2018న విష్ణు నందకుమార్ ను ఉద్యోగం నుంచి తీసేసినట్లు ప్రకటించింది బ్యాంక్. యవత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అసిఫా ఘటనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కొటక్ మహింద్రా తన ఫేస్‌బుక్ అకౌంట్ లో పోస్టు చేసింది.

Reviewed by ADMIN
on
April 14, 2018
Rating:
No comments: