కృష్ణా జిల్లాలో ప్రవేశించిన వైస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర...
THE BULLET NEWS (VIJAYAWADA)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శనివారం దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. కనకదుర్గ వారధి వద్ద వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు.
జననేతతో కలసి అడుగు వేసేందుకు జనం భారీగా తరలిరావడంతో కనకదుర్గ వారధి పోటెత్తింది. వైఎస్ జగన్‌ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.
శనివారం పాదయాత్రలో భాగంగా కనకదుర్గ వారధి గుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడినుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
కృష్ణా జిల్లాలో ప్రవేశించిన వైస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర...
Reviewed by ADMIN
on
April 14, 2018
Rating:
No comments: