Top Ad unit 728 × 90

గొలగమూడి ఫన్ పార్కు నిర్మాణం అధ్బుతం- మేయ‌ర్

The bullet news (Nellore)_  మెట్రో నగరాలకు ధీటుగా నెల్లూరు నగరానికి అత్యంత సమీపంలోని గొలగమూడిలో నిర్మితమైన జల క్రీడల ఆధారిత ఫన్ పార్కు వేసవి విడిది కేంద్రంగా చిన్నారులకు వినోదాన్ని అందిస్తోందని నెల్లూరు నగర మేయరు అబ్దుల్ అజీజ్ సంతోషం వ్యక్తం చేసారు. ఫన్ పార్కు అందిస్తోన్న వినోద నిర్వహణా విధానాన్ని మేయరు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని విద్యార్ధుల వేసవి కాలపు సెలవులను పురస్కరించుకుని ఫన్ పార్కు నిర్వాహకులు అందిస్తోన్న జల ఆధారిత వినోద కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ఆహ్లాదం, వినోదం పొందాలని కోరారు. పార్కులోని వేల్ పూల్, జంగిల్ పూల్, రైన్ డాన్సు, ఫౌంటైన్సు లాంటి నిర్మాణ నమూనాలను ఆదర్శంగా తీసుకుని కార్పోరేషను ఆధ్వర్యంలో ఆధునీకరిస్తున్న నగరంలోని ప్రఖ్యాత పార్కులకు అవసరమైన అధునాతన వినోద ఆహ్లాద పరికరాలను ఏర్పాటు చేస్తామని మేయరు ప్రకటించారు. ఉన్నత విద్యావంతులైనప్పటికీ, వినూత్నంగా ఆలోచించి అధునాతన స్వయం ఉపాధి రంగంగా ఫన్ పార్కు నిర్వహణను ఎంచుకుని దాదాపు అరవై కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నిర్వాహకులు పొత్తూరి సాయి, సంయుక్తల సేవలను మేయరు ప్రత్యేకంగా అబినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షంషుద్దీన్, జాకీర్, సాబీర్ ఖాన్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు
గొలగమూడి ఫన్ పార్కు నిర్మాణం అధ్బుతం- మేయ‌ర్ Reviewed by ADMIN on April 02, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.