చంద్రబాబు పై నమ్మకం తోనే ఏపికి పెట్టుబడులు- పరిశ్రమల శాఖామంత్రి అమర్నాథ్ రెడ్డి
THE BULLET NEWS (CHITTOOR)-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నాయకత్వం పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు చొరవ చూపుతున్నాయి తప్ప కేంద్రాన్ని చూసి కాదని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి పేర్కొన్నారు.. బుధవారం చిత్తూరులోని టిడిపి పార్టీ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఏడు సార్లు భాగస్వామ్య ఒప్పంద సదస్సులు జరిగితే అందులో ఆరు సార్లు చంద్రబాబు హయాం లోనే జరిగాయన్నారు. ఈసారి జరిగిన విశాఖ సమ్మిట్ లో 715 ఒప్పందాలతో రాష్ట్రానికి 4.60 లక్షల వేల కోట్లు రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 11 లక్షల మందికి ఉపాది అవకాశాలు దక్కుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికొస్తున్న పెట్టుబడులు చంద్రబాబునాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకం తోనే వచ్చాయని, కేంద్రం ప్రభుత్వాన్ని చూసు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దిగ్గజాల్లో ఐదవ ఆటోమొబైల్ కంపెనీ కియా కోసం భారత దేశం మొత్తం పోటీ పడినా ఏపీకే రావడం చంద్రబాబు విశ్వసనీయతకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు చెల్లించిన రూ3.500 కోట్ల ఇన్సెంటివ్స్ ను రాష్ట్ర బడ్జెట్ నుంచే ఇచ్చాన్నామన్నారు. కేంద్రం హోదా ద్వారా గానీ, ప్యాకేజీ ద్వారా గానీ రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ ఇస్తే రాష్ట్ర పరిశ్రమలకు చెల్లించిన బడ్జెట్ ను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు. భాగస్వామ్య ఒప్పందం సదస్సులో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కాబట్టి ఏపి హోదా అవసరం లేదంటే అది వారి అవివేకం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నీరు అందించడం వల్లే ఆ ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
మాకూ హోదా ఇవ్వాల్సిందే : రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నేరవేర్చాలని మంత్రి అమరనాథ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని నీతి అయొగ్ చెప్పడంతో నే ప్యాకేజీకి ఒప్పుకున్నామని, అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నందున మాకూ ఇవ్వాల్సిందేనన్నారు. భాగస్వామ్య ఒప్పందం సదస్సులో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నందున ఏపీకి హోదా అవసరం లేదని మిత్ర పక్షం బిజెపి నాయకులు మాట్లాడడం సరైంది కాదన్నారు.
మాకూ హోదా ఇవ్వాల్సిందే : రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నేరవేర్చాలని మంత్రి అమరనాథ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని నీతి అయొగ్ చెప్పడంతో నే ప్యాకేజీకి ఒప్పుకున్నామని, అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నందున మాకూ ఇవ్వాల్సిందేనన్నారు. భాగస్వామ్య ఒప్పందం సదస్సులో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నందున ఏపీకి హోదా అవసరం లేదని మిత్ర పక్షం బిజెపి నాయకులు మాట్లాడడం సరైంది కాదన్నారు.
చంద్రబాబు పై నమ్మకం తోనే ఏపికి పెట్టుబడులు- పరిశ్రమల శాఖామంత్రి అమర్నాథ్ రెడ్డి
Reviewed by ADMIN
on
February 28, 2018
Rating:
No comments: